2 August, 2026 | 6:06 AM

సీఎంను కలిసిన రోజే పరిష్కరించారు : నామా నాగేశ్వరరావు

22-06-2024 03:31 PM

హైదరాబాద్ : బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ, బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, డా. నోరి దత్తాత్రేయుడు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ట్రస్టు పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన రోజే పరిష్కరించినట్లు తెలిపారు. బసవతారకం సేవల విస్తరణకు 10 ఎకరాలు కేటాయించాలని, నూతన భవనాలకు అనుమతుల కోసం చొరవ తీసుకోవాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టిపిడిస్తోందన్నారు. ఆసుపత్రి సేవల మరింత విస్తుతం చేయడం కోసం సహకారించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన వెంటనే అంగీకారం తెలిపినట్లు నామా పేర్కొన్నారు.