అయోధ్య రామ్‌లల్లాకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రధాన పూజారి కన్నుమూత
22-06-2024 03:54 PM
లక్నో: అయోధ్యలో రామ మందిర ప్రతిష్టలో కీలక పాత్ర పోషించిన ప్రధాన అర్చకులు ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ (86) శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీక్షిత్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. దీక్షిత్ అంత్యక్రియలు మణికర్ణికా ఘాట్‌లో జరగనున్నాయి. జనవరి 22న అయోధ్య ఆలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాకు చెందిన దీక్షిత్ వారణాసికి చెందిన ప్రముఖ పండితులలో ఒకరిగా గుర్తింపు పొందారు. దీక్షిత్ మృతిపట్ల ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు.






