బసవేశ్వరుడి సిద్ధాంతాలు ఆచరణీయం
11-05-2024 02:33 AM
మంత్రి దామోదర రాజనర్సింహ
అందోల్, మే 10 : బసవేశ్వరుడి సేవలు అమోఘం అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. శుక్రవారం జోగిపేటలోని బసవేశ్వర మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వరుడు బోధించిన సిద్ధాంతాలు ఆచరణీయమని తెలిపారు. హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో మహాత్మ బసవేశ్వరుడిది ప్రత్యేక స్థానమని చెప్పారు. కార్యక్రమంలో అందోల్ మున్సిపల్ లింగాయత్ సమాజం ప్రముఖులు, బసవేశ్వరుడి అభిమానులు, పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతి నిధులు పాల్గొన్నారు.






