గొప్ప అభ్యుదయవాది బసవేశ్వరుడు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు, మే 10 : సమాజంలో అంటరానితనం, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని ఎమ్మెల్యే గూడెం మహిపా ల్‌రెడ్డి కొనియాడారు. మహాత్మ బసవేశ్వరుడి 891జయంతిని పురస్కరించుకొని శుక్రవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో బసవేశ్వరుడి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ శతాబ్దంలోనే కులం, మతం, వర్ణ వివక్షతలేని సమాజం కోసం పని చేసిన గొప్ప అభ్యుదయవాది బసవేశ్వరుడని పేర్కొన్నారు. అనంతరం బీరంగూడ చౌరస్తాలో గల మహాత్మ బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, రామ చంద్రాపురం కార్పొరేటర్ పుష్పానగేశ్, మాజీ ఏఎంసీ చైర్మన్ విజయ్ కుమార్, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్‌రెడ్డి, బసవేశ్వర్, పరమేశ్‌యాదవ్, అప్జల్, జగదీశ్వర్ పాల్గొన్నారు.






