24 June, 2026 | 2:28 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

'కవిత పాంచజన్యం'.. ఐదు కీలక హామీలు ఇవే..!

25-04-2026 11:37 AM

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం తన కొత్త పార్టీని ప్రకటించారు. ఆ పార్టీ పేరును 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS)గా పేర్కొన్నారు. మేడ్చల్‌లోని మునిరాబాద్‌లో ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్‌లో కవిత ఈ ప్రకటన చేశారు. పార్టీ పేరును ప్రకటించడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన పలువురు నాయకులు విచ్చేశారు. ఈ సమావేశంలో కవిత పార్టీని కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పాంచజన్యం పేరుతో కవిత ఐదు హామీలు ప్రకటించారు.

1. విద్య: ప్రైవేట్‌ స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య అందిస్తాం. 

2. వైద్యం: ఏ రోగమైనా రానీ, ఏ ఆస్పత్రైనా సరే ఉచితంగా అందిస్తాం.

3. వ్యవసాయం: రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం.

4. ఉపాధి: రూ.2 లక్షల-రూ.20 కోట్ల వరకు యువతకు రుణాలు.. మొదటి ఏడాదిలోనే సింగిల్‌ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు.. ఉద్యమకారులకు లక్ష సూపర్‌ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తాం. 

5. సామాజిక న్యాయం సాధించాల్సిందే.