25 April, 2026 | 1:19 PM

బీఆర్ఎస్ నాయకులకు రైతుల పక్షాన మాట్లాడే అర్హత లేదు

25-04-2026 11:47 AM

ఖమ్మంజిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు..

కూసుమంచి, ఏప్రిల్ 25(విజయక్రాంతి): బీఆర్ఎస్ నాయకులు రైతుల పక్షాన ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని, మీకు రైతుల పక్షాన మాట్లాడే అర్హత ఉందా..? అని ఖమ్మంజిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు ఘాటుగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో పండనంతా విధంగా గత సంవత్సరం,ఈ సంవత్సరం వరి,మొక్కజొన్న పండడం హర్షనీయమన్నారు..రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.. దానికి తక్కట్టుగానే ప్రభుత్వం అన్ని విధాలుగా రైతు పండించిన పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కోనుగోలు చేస్తామన్నారు..వీరు మోసలి కన్నీరు కారుస్తూ, సానుభూతిని తెలియజేయనవసరం లేదని హెచ్చరించారు..రైతులు అంత యార్డ్ లలో బస్తాలను కాటాలు వేసుకునే పనుల్లో ఉన్నారు..రైతులకు అవసరం ఉన్న చోట కోనుగోలు కేంద్రాలను తెరిచి,ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం సృష్టమైన ఆదేశాలు జారీ చేసింది అని పేర్కొన్నారు..

ప్రభుత్వానికి ఎంత కష్టమైన,నష్టమైనా భారించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు,తుమ్మల నాగేశ్వరరావు గారు,పోంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సృష్టమైన ఆదేశాలు ఇచ్చారు..ఇప్పటికే మూఫై కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు..ఇంకా అవసరమైతే ఏర్పాటు చేస్తామన్నారు..ఇప్పటికే 50వేల మెట్రిక్ టన్నులు కోనుగోలు కేంద్రాల ద్వారా కోనుగోలు చేయడం జరిగిందని తెలిపారు..ఇంకా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు..