బస్వాపూర్ అభివృద్ధికి సహకరిస్తాం: షబ్బీర్ అలీ
భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ(Baswapur villagers) అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం కామారెడ్డిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Government Advisor Shabbir Ali), జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్(Zaheerabad MP Suresh Shetkar)ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రజల అవసరాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్ సానుకూలంగా స్పందించి బస్వాపూర్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బస్వాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నె మల్లేశం, మాజీ అధ్యక్షుడు చింతనూరి సిద్ధరాములు, యువజన కాంగ్రెస్ నాయకుడు తుడుం ప్రదీప్, కాంగ్రెస్ నాయకుడు మామిడి యాదగిరి పాల్గొన్నారు.