మాజీ మంత్రి పరామర్శ
19-07-2026 05:02 PM
నిర్మల్ జులై 19 ( విజయక్రాంతి): ఇటీవల హైదరాబాద్‌లో గుండెపోటుకు గురై శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న నాలం శ్రీనివాస్ సోదరుడు నాలం మదనమోహన్‌ను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పాకాల ఫౌండేషన్ చైర్మన్ పాకాల రామచందర్ ఆదివారం నిర్మల్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి పీఏసీఎస్ చైర్మన్, గంగారెడ్డి మాజీ ఆత్మ చైర్మన్, అనుముల భాస్కర్ బీసీ సంఘం అధ్యక్షుడు, రవి, వినయ్, భూమేష్, నరేందర్, నమస్తే తిరుపతి, లక్ష్మణ్, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






