20 July, 2026 | 4:12 AM

ఆశా వర్కర్ శారద మృతి పట్ల సండ్ర సంతాపం

19-07-2026 05:08 PM

కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే

కల్లూరు,జూలై 19(విజయ క్రాంతి): కల్లూరు మండలం రఘునాథగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు జానపాటి రామారావు సతీమణి, ఆశా వర్కర్ జానపాటి శారద ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు.ఈ నేపథ్యంలో సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య వారి నివాసానికి వెళ్లి రామారావుని,కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.ఈ సందర్భంగా శారద మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ,కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,మాజీ జెడ్పీటీసీ సభ్యులు కట్టా అజయ్ కుమార్,చండ్రుపట్ల గ్రామ సర్పంచ్ కాటంనేని విజయలక్ష్మి వెంకటేశ్వరరావు,బీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు, కౌన్సిలర్ పెడకంటి రామకృష్ణ, పసునూరి శ్రీనివాసరావు,మేకల కృష్ణ,కొరకొప్పు ప్రసాద్,సీహెచ్ కిరణ్,గ్రామ నాయకులు కావటి నర్సయ్య,మాజీ సర్పంచ్ కుక్కా అంజన్ రావు,బండి వెంకటి తదితరులు పాల్గొన్నారు.