అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థుల విశిష్ట ప్రతిభ
ఘట్ కేసర్, జూలై 19(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు(Anurag University School of Pharmacy students) భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐఐటీల సమన్వయంతో నిర్వహించబడిన స్వయం ఎన్ పి టి ఇ ఎల్ 2026 ఆన్‌లైన్ సర్టిఫికేషన్ పరీక్షల్లో విశిష్ట ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయానికి మరోసారి గౌరవాన్ని తీసుకువచ్చారు. హెర్బల్ ప్రొడక్ట్ టెక్నాలజీ అండ్ రెగ్యులేటరీ సైన్స్ కోర్సులో సాయి శ్రీనికేత్ తల్లాప్రగడ, తీర్థ వికేష్ 94 శాతం మార్కులతో దేశవ్యాప్తంగా టాప్ 2 శాతం ర్యాంక్ అచిఎవేర్స్ గా నిలిచి విశ్వవిద్యాలయానికి గర్వకారణంగా నిలిచారు. అదే కోర్సులో షేక్ షీమా షిరీన్ 92 శాతం, తీర్ధాల సాయితేజల్ 91 శాతం, చింతల చెరువు వెంకట రవితేజ భగీరథ్ 90 శాతం షేక్ హఫ్సా మరియం 90 శాతం, పాలోజు సాయి వర్ధన్ 90 శాతం గోల్డ్ సర్టిఫికేషన్ సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.
ఈ కోర్సుకు మెంటర్‌గా వ్యవహరించిన డాక్టర్ అంగిలికం అవినాష్ అందించిన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం విశేషంగా దోహదపడింది. టాప్ 2 శాతం, కోల్డ్ సర్టిఫికేషన్ సిల్వర్ సర్టిఫికేషన్ సాధించడం పట్ల డాక్టర్ అంగిలికం అవినాష్‌ను డీన్ ప్రత్యేకంగా అభినందించారు. జనరల్ ఫార్మకాలజీ కోర్సులో సిల్వర్ సర్టిఫికేషన్ సాధించిన సిరి, నందిని, నేహా, శ్రావ్య రెడ్డి, సాయి ప్రణవ్య, ఈగ శ్రావంతి, లావణ్య విద్యార్థులను, మెంటర్‌గా వ్యవహరించిన డాక్టర్ పి. నవీన్ ను డీన్ డాక్టర్ వసుధా బక్షి అభినందిస్తూ భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు స్వయం ఎన్ పి టి ఇఎల్ కోర్సుల్లో పాల్గొని జాతీయ, స్థాయిలో విశిష్ట విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.






