అమ్మవారికి బోనం సమర్పించిన ఆర్యవైశ్యులు
నిర్మల్ జులై 19 ( విజయ క్రాంతి): ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన బంగల్‌పేట్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆదివారం ఆర్యవైశ్యులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సాకెర గ్రామ శివారులోని శ్రీ రమా సహిత శివ పంచాయతన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తిపూర్వకంగా వాసవి మాత పారాయణం చేసి, అమ్మవారి అనుగ్రహం, కుటుంబ సౌభాగ్యం కోసం గోరింటాకు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆవోపా ఆధ్వర్యంలో ఆలయానికి భక్తుల వినియోగార్థం ప్యూరిఫైడ్ వాటర్ ఫ్రిజ్‌ను అందజేశారు. అనంతరం అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఆమెడ కిషన్, కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






