15 June, 2026 | 8:44 PM

Breaking News

సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •  

ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ పండుగ

01-10-2025 01:03 AM

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

చిట్యాల,సెప్టెంబర్ 30(విజయక్రాంతి):తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు,ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగా అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ గ్రామంలో ఏర్పాటుచేసిన సద్దుల బతుకమ్మ వేడుకల్లోఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ఆడబిడ్డలతో కలిసి ఆడి పాడారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకున్నారన్నారు. ఎంగిలి పూలతో ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో శోభాయమానంగా ముగిసిన ఈ తొమ్మిది రోజులు ఆడపడుచుల ఆనందాల ఉత్సవమన్నారు.

తల్లి గౌరమ్మను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే ఈ పండుగలో భాగంగా మహిళలు ఆరాటంగా పూలను సేకరించి, వాటిని అందంగా అలంకరించి ఆడటం మన సంస్కృతికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ,మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి,జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధువంశీ కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.