11 March, 2026 | 2:49 PM

Breaking News

మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •  

సెలవు ఇవ్వడం లేదని..

30-10-2024 12:43 AM

బెటాలియన్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 29: అధికారులు సెలవు ఇవ్వడంలేదని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం మండల పరిధిలో చోటు చేసుకుంది. మిర్యాలగూడకు చెందిన నాగేశ్వర్‌రావు.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని అక్టోపస్ క్యాంపస్‌లో 3వ నంబర్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయి తే ఇటీవల తన అవసర నిమిత్తం అధికారులను సెలవు అడిగితే ఇవ్వడం లేదని మనస్థాపానికి గురై మంగళవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తోటి కానిస్టేబుల్స్ పెట్రోల్ బాటిల్‌ను లాక్కొని అధికారుల దగ్గరికి తీసుకువెళ్లి జరిగిన విష యం వివరించారు. అయితే అతడిని మందలించిన ఉన్నతాధికారులు.. మరోసారి ఇలా చేయవద్దని చెప్పి సెలవు ఇచ్చినట్లు సమాచారం.