10 June, 2026 | 1:27 AM

బీబీ.. జాగ్రత్తగా ఉండు!

10-06-2026 12:00 AM

నెతన్యాహుకు ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్, జూన్ ౯: ‘బీబీ (బెంజమిన్ నెతన్యాహు) జాగ్రత్తగా ఉండు.. ఇరాన్‌పై బేషరతుగా దాడులు ఆపేయ్. లేకుంటే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావ్’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఇజ్రా యెల్ ప్రధానిని తీవ్ర స్వరంతో హెచ్చరిం చారు. తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఈ పరిణామం చోటుచేసు కుందని అంతర్జాతీయ మీడియాలో కథనా లు ప్రసార మవు తున్నా యి.

‘మాట వి నకపోతే ఇజ్రా యెల్‌కు అమెరికా నుంచి ఎలాంటి మద్దతు ఉండదు’ అని ట్రంప్ తేల్చిచెప్పిన ట్లు కథనాల సా రాంశం. ట్రంప్ ఫోన్ కాల్ తర్వాత నెతన్యా హూ వెంటనే తన సైనిక కమాండర్లను పిలి పించుకుని ఇరాన్ దాడులు నిలిపివేశారు.