వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే!
- గత ప్రభుత్వాల వల్లే వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యం
- తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం
- బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రాబోతోందని, అవినీతి రహిత పాలన, అభివృద్ధి బీజేపీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు రాంచందర్‌రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు భూసేకరణ చేయకపోవడంతోనే వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్టు ఆలస్యమైందన్నారు. సింగరేణిని బీఆర్‌ఎస్, కాం గ్రెస్ ప్రభుత్వాలు నష్టాల్లోకి నెట్టాయని విమర్శించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
2028 జూన్ నాటికి వరంగల్ ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఎయిర్‌పోర్ట్ట్ స్ట్రిప్ 130 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలోనే నిర్మించిన పురాతనమైన, పెద్ద రన్‌వే అని పేర్కొన్నారు. యూపీఏ హయాంలోనే రైట్స్ సంస్థ ఫీజబిలిటీ నివేదిక ఇచ్చినప్పటికీ రాష్ట్రంలోని నాటి కాం గ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
హైదరాబాద్ అంతర్జా తీయ విమానాశ్రయం నిర్మాణ ఒప్పందంలోని క్లాజ్ 5.2 ప్రకారం 150 కిలో మీటర్ల పరిధిలో మరో ఎయిర్‌పోర్టు రాకూడదనే నిబంధన అడ్డంకిగా మారిందని, గత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును ఉత్తరాలకే పరిమితం చేసిందన్నారు.
మీ వైఫల్యాలను కేంద్రంపై నెట్టొద్దు..
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వరంగల్ ఎయిర్‌పోర్టుకు మార్గం సుగమమైందని రాచందర్‌రావు స్పష్టం చేశా రు. సీఎం రేవంత్‌రెడ్డి వాస్తవాలను దాస్తున్నారని, వారి వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వ రంగల్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు, అభివృద్ధి వెనుక కేంద్ర ప్రభుత్వ కృషిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు.
ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ‘ఉడాన్’ పథకం ద్వారా దేశంలో విమానాశ్రయాల సంఖ్య 75 నుండి భారీగా పెరిగిందని, ఇందులో భాగంగానే వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు ఉన్న 150 కిలోమీటర్ల నిబంధన క్లియరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టి సాధించిందని వివరించారు. 2011 నాటి నివేదిక ఆధారంగా దేశంలోని సోలాపూర్, తేజు, పాసిఘాట్, మాల్దా వంటి ఎన్నో ప్రాం తాలలో ఎయిర్‌పోర్ట్‌లు పూర్తయ్యాయని, గత ప్రభుత్వాలు భూ సేకరణ చేయకపోవడం వల్లే వరంగల్ ప్రాజెక్ట్ ఆలస్యమైందని తెలిపారు.
గత కేసీఆర్ సర్కార్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేదని, రెండు పార్టీలూ అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నాయని రాంచందర్‌రావు విమర్శించారు. వరంగల్‌తో పాటు ఆదిలాబాద్ డిఫెన్స్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయ కుండా తక్షణమే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి ఏఏఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అందులో భా గంగానే తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ను నేరుగా సింగరేణికి అప్పగించినట్లు తెలిపారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకు ని రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కువ మంది దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ తరఫున గెలిచేలా కా ర్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలని బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో దళిత ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించిన పార్టీ కూడా బీజేపీయేనని, దళితుల సంక్షేమం, సాధికారత కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.
బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత దళితులపై అన్యాయం పెరిగిందని, మూసీ పేరుతో అనేక బస్తీల ను తొలగించి, అక్కడ నివసిస్తున్న ఎస్సీలకు సరైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై సమగ్ర చర్చ అవసరం ఉందని, ఇప్పటికే ఇతర కేటగిరీల కింద రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్న వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తింపజేయాలనే అంశంపై రాజ్యాంగస్పూర్తికి అనుగుణంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.






