calender_icon.png 18 February, 2026 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతి నిలయాలుగా బీసీ గురుకులాలు

18-02-2026 10:05:41 PM

ఆర్సిఓ శ్రీధర్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే బిసి గురుకుల పాఠశాలు సరస్వతి నిలయాలుగా నిలుస్తున్నాయని గురుకులాల సమన్వయకర్త శ్రీధర్ అన్నారు. బుధవారం మండలంలోని బాబాపూర్ లో గల బాలికల బీసీ గురుకుల పాఠశాల వార్షికోత్సవం, పదవ తరగతి విద్యార్థులకు ఏర్పాటుచేసిన వీడ్కోలు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన పాటు వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వేడుకల సందర్భంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుకన్య, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.