10 March, 2026 | 4:05 AM

బీహార్ నుంచి బీసీ నేత ఢిల్లీకి!

10-03-2026 02:11 AM

దుప్పటి మొగిలి :

* సోషలిస్ట్ మూలాలను వదులుకోకుండానే, సామాజిక న్యాయం కోసం గళం విప్పడం నితీశ్ ప్రత్యేకత. ఢిల్లీ వేదికగా ఆయన ప్రసంగించే అంశాలు, వెనుకవడిన వర్గాలను కొంత వరకూ ప్రభావితం చేసే అవకాశం ఉంది. 

బీహార్ రాజకీయ నేత నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని వీడి రాజ్యసభ వైపు అడుగులు వేయడం భారత రాజకీయాల్లో మరో మలుపుగా కనిపిస్తోం ది. మూడు దశాబ్దాలుగా బీహార్ గడ్డపై సా మాజిక న్యాయం, అభివృద్ధిని మేళవించి పాలన సాగించిన నితీశ్, ఇప్పుడు జాతీయ వేదికపై తన ముద్ర వేసే అవకాశాలు ఉన్న ట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నిర్ణయం వెనుక లోతైన రాజ కీయ తాత్వికత ఉంటుందని భావిస్తున్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో బీహార్ ఎ ప్పుడూ ఒక రాజకీయ ప్రయోగశాలగానే ఉండేది. శతాబ్దాల కుల వివక్షను ఎదిరిస్తూ సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటాలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి. డాక్ట ర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు.. రామ్ మనోహర్ లోహియా ఆలోచనలు.. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమాల నుంచి ఎది గిన నాయకుల్లో నితీశ్ కుమార్ ఒకరు. భార త సోషలిస్ట్ ఉద్యమ చరిత్రంలో నితీశ్‌ది ఒక విలక్షణమైన అధ్యాయం.

జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) ‘సంపూర్ణ విప్లవం’ నుంచి ఉ ద్భవించిన నితీశ్, కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా సోషలిస్ట్ సిద్ధాంతాలను ఆధునిక పరిపాలనాంశాలతో ము డిపెట్టిన దార్శనికుడిగా గుర్తింపు పొందారు. నాటి బీహార్‌కు చెందిన రాజకీయ దిగ్గజం కర్పూరీ ఠాకూర్ ఆచరించిన విధానాలను, నితీశ్ పుణికిపుచ్చుకున్నారు. రామ్ మనోహర్ లోహియా ‘నాలుగు స్తంభాల రాజ్యం’ భావనను స్ఫూర్తిగా తీసుకుని, నితీశ్ అధికార పగ్గాలు చేపట్టి.. వికేంద్రీకరణ ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థలో మహిళలకు, వె నుకబడిన వర్గాలకు పెద్దపీట వేశారు.

ఆయ న సోషలిజం కేవలం నినాదాలకు పరిమి తం కాకుండా, మౌలిక సదుపాయాల కల్ప న, విద్యావకాశాల విస్తరణ ద్వారా అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేశారు. సోషలిస్ట్ మూలా లను వదులుకోకుండానే, సామాజిక న్యా యం కోసం గళం విప్పడం నితీశ్ ప్రత్యేకత.

ఢిల్లీ వేదికగా ఆయన ప్రసంగించే అంశాలు, వెనుకవడిన వర్గాలను కొంత వరకూ ప్రభావితం చేసే అవకాశం ఉంది. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం నాటి యువతలో చైతన్యాన్ని నింపింది. దీనిలో భాగంగానే నితీశ్ పరిణతి చెందిన రాజకీయనాయకుడయ్యారు. ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్లడం అంటే వెనుకబడిన వర్గాలకు ఒక బలమైన ఢిల్లీ ప్రతినిధి లభించినట్లే.

బీసీ గొంతుక కావాలని ఆకాంక్షలు

1990 ప్రాంతంలో నాటి ప్రధాని వీపీ సింగ్ తీసుకువచ్చిన మండల్ కమిషన్ సిఫారసులు భారత రాజకీయాలను సమూలం గా మార్చేశాయి. అప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న బీసీ వర్గాలు రాజకీ యంగా శక్తిమంతం అయ్యాయి. లాలూ ప్ర సాద్ యాదవ్ వంటి నేతలు సామాజిక ప్రాతినిధ్యంపై దృష్టి పెట్టగా.. నితీశ్ కుమార్ ఆ అంశానికి ‘అభివృద్ధి’ అనే కొత్త హంగు ను జోడించారు. బీహార్ ఎదుర్కొంటున్న నే రాలు, అవినీతి సమస్యలను పరిష్కరిస్తూనే అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలను అం దించారు.

బాలికల విద్య కోసం సైకిల్ పంపి ణీ.. మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వంటి విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ నితీ శ్ అలాంటి అంశాలకే ప్రాధాన్యమిస్తే బా గుంటుందని బీసీలు భావిస్తున్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలు అధికారంలో భాగస్వాములు కాకుండా, ప్రజాస్వామ్యం సంపూర్ణం కాదని నితీశ్ బలంగా నమ్ముతారు.

బీసీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం పెంచడం ద్వారా ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవతుందని విశ్వసిస్తారు. ఇప్పుడు రాజ్యసభ వేదికగా ఆయన బీసీల గొంతుక కావాలని ఆయా వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. నితీశ్ కుమార్ రాజకీయ ప్రయా ణంలో ఆయన కొన్ని కూటములతో జత కట్టినప్పటికీ, అంతిమ లక్ష్యం మాత్రం వెనుకబడిన వర్గాల ప్రయోజనం ఉండాలని కోరుకుంటున్నాయి.

బీజేపీ వ్యూహాలు..

నితీశ్ కుమార్ రాజ్యసభ ప్రవేశాన్ని బీజే పీ అగ్రనాయకత్వం ఒక వ్యూహాత్మక పరిగణిస్తున్నట్లు కనిపిస్తున్నది. జాతీయ స్థాయి లో బీసీ వర్గాల మద్దతును కూడగట్టడంలో నితీశ్ కున్న అపారమైన అనుభవం, క్షేత్రస్థా యి పట్టును తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో వెనుకబ డిన వర్గాల ఓటు బ్యాంకును క్యాష్ చేసుకోవచ్చని, అందుకు నితీశ్ ఉపయోగపడతార ని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

రాష్ట్ర రాజకీయాల నుంచి ఆయనను కేంద్రానికి తీసు కురావడం ద్వారా బీహార్లో బీజేపీ సొంతం గా ఎదిగేందుకు, సొంత ముఖ్యమంత్రి అభ్యర్థిని తయారు చేసుకునేందుకు అవసరమైన రాజకీయ శూన్యతను సృష్టించుకోవచ్చనేది, వారి అంతర్గత వ్యూహం కావొచ్చనే అభిప్రాయమూ కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో రాజ్యసభలో విపక్షాల ఐక్యతను దెబ్బతీయడానికి, విధానపరమైన నిర్ణ యాల్లో అనుభవజ్ఞుడైన మిత్రుడిని పక్కన ఉంచుకోవడానికి నితీశ్ సరైన వ్యక్తి అని మోదీ-షా ద్వయం గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తున్నది.

నితీశ్ వంటి ‘సోషలిస్ట్’ నేప థ్యం ఉన్న నాయకుడు ఎన్డీయే పక్షాన నిలబడటం వల్ల సామాజిక న్యాయంపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని దేశవ్యాప్తంగా చాటిచెప్పవచ్చని, తద్వారా రాబోయే ఎన్నికల్లో బీసీ ఓటర్లను మరింతగా ఆకట్టుకోవచ్చని బీజేపీ అధినాయకత్వం లెక్కలు వేస్తోంది.

అనూహ్యమైన ఎత్తుగడలు

నితీశ్ రాజకీయ ప్రయాణం ఒక సాధార ణ కుటుంబం నుంచి ప్రారంభమైంది. మ ధ్యతరగతి నేపథ్యం నుంచి ఆయన విద్యను ఆయుధంగా మార్చుకున్నారు. ఆయన రాజకీయ సమీకరణాల్లో ఒక ప్రత్యేక లక్షణం ఉం ది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన దిట్ట. ఈ మార్పు లు కొన్నిసార్లు విమర్శలకు దారి తీసినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేని పోరా టం చేశారు. ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్లడం బీసీ వర్గాలకు కొంత ఆశాజనకమైన  విషయం.

జాతీయ రాజకీయాల్లో బీసీ ఓటు బ్యాంకు నిర్ణయాత్మక శక్తిగా మారిన తరుణంలో.. నితీశ్ వంటి అనుభవజ్ఞుడైన నేత ఢిల్లీలో ఉండటం అన్ని పార్టీల సమీకరణాలను ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భా విస్తున్నారు. జాతీయ స్థాయిలో బీసీ జనగణన చర్చ తీవ్రమవుతున్న తరుణంలో నితీశ్ కుమార్ రాజ్యసభ ప్రవేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. బీహార్‌లో కుల గణనను విజయవంతంగా పూర్తి చేసి.. జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్ల పెంపునకు బాటలు వేసిన అనుభవం ఆయనకు ఉంది.

ఇదే నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కేవలం సంఖ్యాబలమే కాకుండా.. విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు దక్కాల్సిన వాస్తవ వాటాపై ఆయన గొంతెత్తాలని బీసీ వర్గాలు కోరుకుంటున్నాయి. మేధావులు, అనుభవజ్ఞులు కొలు వుదీరే సభ రాజ్యసభ. అక్కడ నితీశ్ కుమార్ అడుగుపెట్టడం వల్ల దేశవ్యాప్త విధానాల రూపకల్పనలో సామాజిక న్యాయానికి పెద్దపీట పడే అవకాశం ఉంది.

ముఖ్యంగా విద్య, ఆర్థిక వనరుల్లో బీసీల వాటా కోసం ఆయన దేశవ్యాప్త ఉద్యమాన్ని లేదా చర్చను లేవనెత్తవచ్చు. ముఖ్యమంత్రిగా ఆయన రాజీనా మా ఒక పదవీ విరమణ కాదు.. అది జాతీ య రాజకీయాల్లో ఒక కొన్ని మార్పులకు నాంది. యాదవ్, కుర్మీ, కుష్వాహా వంటి వివిధ బీసీ వర్గాలను ఏకం చేసి ఒక రాజకీయ శక్తిగా మార్చిన ఘనత ఆయనకే దక్కు తుంది. నితీశ్ నిర్ణయంతో బీసీ రాజకీయా లు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. ము న్ముందు నితీశ్ దేశవ్యాప్త బీసీ నాయకుడిగా ఆయన అవతరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

 వ్యాసకర్త సెల్: -84668 27118