8 July, 2026 | 5:02 PM

Breaking News

పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •   డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •  

ఎంఎస్‌ఎంఈలకు బీడీఎల్ ఊతం

09-06-2025 02:36 AM
  1. ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తితో ముందుకు..
  2. హెచ్‌ఎంఏ వార్షిక అవార్డుల ప్రదానంలో రిటైర్డ్ కమడోర్ మాధవరావు

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): భారత్ డైనమిక్ లిమిటెడ్(బీడీఎల్) కేవలం దేశ భద్రతను బలోపేతం చేయడమే కాకుం డా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని దాదాపు 3,200 ఎంఎస్‌ఎంఈలకు ఊతమిచ్చి, స్వదే శీ సామర్థ్యాన్ని, సృజనాత్మకతను కూడా పెంపొందించిందని ప్రముఖ వ్యూహాత్మక ఆలోచనల నిపుణుడు, రిటైర్డ్ కమడోర్ మాధవరావు తెలిపారు.

ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తిని కూడా బీడీఎల్ ప్రదర్శిస్తుందన్నా రు. మేనేజ్‌మెంట్, సృజనాత్మకత, డిఫెన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి రంగాల్లో అపారమైన సేవలు అందించిన పలువురు వ్యక్తు లు, సంస్థలను హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(హెచ్‌ఎంఏ) వార్షిక అవార్డు ల ప్రదాన కార్యక్రమంలో సత్కరించింది.

రిటైర్డ్ వింగ్ కమాండర్ ఆవుల భరత్‌భూషణ్‌కు జీవన సాఫల్య అవార్డును, స్వస్థవ క్యాన్సర్ కేర్ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డా.వాసుదేవ్ చతుర్వేదికి ‘బెస్ట్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును, ఫిన్‌టెక్ కంపెనీల్లో ఒకటైన జాగిల్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డా.రాజ్ నారాయణంకు ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆఫ్ ది ఇయర్ 24-25’ అవా ర్డును అందించారు.

ఈ సందర్భంగా కమడోర్ మాధవరావు మాట్లాడుతూ.. ఇలాంటి అవార్డులతో గుర్తింపు సాధించామన్న సంబరాలే కాదని, తదుపరి తరం నాయకులకు ఒక స్ఫూర్తిని రగిలిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఎంఏ కార్యదర్శి అల్వాల దేవేందర్‌రెడ్డి, అధ్యక్షుడు కే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.