17 April, 2026 | 4:07 PM

బడుగులకే మంత్రి పదవులు హర్షణీయం

09-06-2025 02:33 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ 

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): రాష్ర్టంలో సమగ్ర కులగణన తర్వాత జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలనే రాహుల్ గాంధీ సంకల్పం చాలా గొప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో సామాజిక న్యాయం అమలు చేసి.. బడుగులకు మంత్రి పదవులు కేటాయింపు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత పదవుల్లో 66 మందికి గాను.. 40 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు  పదవులు కేటాయించారని... ఇప్పుడు మూడు మంత్రి పదవులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించడం హర్షణీయమని తెలిపారు.