15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ముందు వెళ్తున్న లారీని ఢీకొని డ్రైవర్ దుర్మరణం

09-06-2025 09:28 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) తొర్రూరు వద్ద ముందు వెళ్తున్న లారీని గ్రానైట్ లోడ్ తో వెళుతున్న లారీ ఢీకొనడంతో గ్రానైట్ లారీ డ్రైవర్ బాలరాజు దుర్మరణం పాలయ్యాడు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు నాలుగు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. లారీ క్యాబిన్ పై వెనుక ఉన్న గ్రానైట్ రాళ్లు దూసుకు రావడంతో మృతదేహం అందులో ఇరుక్కుపోయింది. దీనితో భారీ క్రేన్, జేసీబీ తెప్పించి రాళ్లను పక్కకు జరిపి డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు.