వర్షాకాలంలో జాగ్రత్త!
11-07-2026 12:00 AM
నైరుతి రుతపవనాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు, వాహనదారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే. పిడుగుపాటుకు గురై మరణిస్తున్న వారిలో అధిక శాతం మంది పశువుల కాపర్లు, వ్యవసాయ భూముల్లో పనిచేసుకునే రైతులు, కూలీలు ఉంటున్నారు. పిడుగుల నుంచి తప్పించుకోవడానికి అప్రమత్తతతో వ్యవహరించాలి. పిడుగు పడే సమయంలో సమీపంలోని భవనాల్లోకి వెళ్లాలి. ఆరుబయట ఫోన్ వినియోగించవద్దు. యాప్‌ల ద్వారా ముందుగానే సమాచారాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి.
కామిడి సతీష్‌రెడ్డి,
జయశంకర్ భూపాలపల్లి,
9848445134






