11 July, 2026 | 2:44 AM

మొబైల్‌లో హెల్త్ కార్డులు

11-07-2026 01:27 AM
  1. క్యూఆర్ కోడ్ ద్వారా డౌన్‌లోడ్‌కు అవకాశం
  2. ఈనెల 15 నుంచి ఈహెచ్‌ఎస్ అమలు
  3. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ
  4.   943 ఆస్పత్రుల్లో 2,594 చికిత్సలకు క్యాష్‌లెస్ వైద్యం
  5. మార్గదర్శకాలపై నాలుగు రోజుల్లో జీవో
  6. సీఎస్‌తో ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్టు సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. క్యూఆర్ కోడ్‌తో నూతన హెల్త్‌కార్డులను మొబైల్ నుంచి ఉద్యోగులు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈనెల 15 నుం చి హెల్త్ కార్డులను జారీచేసి నగదు రహిత వైద్యాన్ని అందించనుంది. 943 ఆస్పత్రుల్లో 2,594 చికిత్సలకు క్యాష్‌లెస్ వైద్యం పొం దొచ్చు. ఈహెచ్‌ఎస్ మార్గదర్శకాలపై నాలు గు రోజుల్లో జీవో రానుంది.

ఈనెల 27న మరోసారి హెల్త్‌కేర్ ట్రస్టుతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలో ఉద్యోగులకు హెల్త్ కార్డులను అధికారికంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన, నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ఈ హెల్త్ కార్డు విధానం ఉపయోగపడుతుందని సమావేశంలో అభిప్రాయపడుతూ, అమలుకు సం బంధించిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. క్యూఆర్ కోడ్‌తో నూతన హెల్త్ కార్డు లు మొబైల్ నుంచి ఉద్యోగులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు అన్ని వివరాలతో ఈహెచ్‌సీటీ యాప్ రూపొందించను న్నారు.

అందించే చికిత్సలకు సీజీహెచ్‌ఎస్ రేట్లు వర్తింపచేయాలని నిర్ణయించారు. నాలుగు రోజుల్లో నూతన ఈహెచ్‌ఎస్ మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయనున్నారు. ఈనెల 27న మరోసారి సమావేశం కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 943 ఆస్పత్రుల్లో హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురా నున్నారు. మొత్తం 2594 చికిత్సలకు క్యాష్‌లెస్ వైద్యాన్ని అందించనున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ఉన్న బకాయిలును విడుదల చే యాలని కూడా నిర్ణయించారు.

నూతన ఈహెచ్‌ఎస్ మార్గదర్శకాలపై చర్చ కో సం ఈనెల 13వ తేదిన సీ ఈఓతో సమావేశం ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఖర్చుతో మరో 24 జిల్లా కేంద్రంలో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. క ర్నూలు, విజయవాడ లోని ఆస్పత్రుల్లోనూ తెలంగాణ హెల్త్ కార్డులు అమలయ్యే లా చర్యలు తీసుకోవాల ని ఈ మేరకు పీఆర్టీయూ టీఎ స్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతేక ప్రధానకార్యదర్శి బీఎండీ ఎక్కా, ముఖ్యకార్య దర్శి క్రిస్టినా చోంగ్తూ, ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, డీజీ షికా గోయల్, కార్యదర్శలు హనుమంత్ కొండిబా, పాపిరెడ్డి, వాణి తదితర ఉన్నతాధికారులు సమావేశంలో ఉన్నా రు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులు టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీ శ్వర్, టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్, దామోదర్‌రెడ్డి (పీఆర్టీయూ), చావా రవి (యూటీఎఫ్), శ్రీనివాసరెడ్డి (సెక్రటేరియట్ అసోసియేషన్), వంగా రవీందర్‌రెడ్డి (ట్రెసా), జేఏసీ నాయకులు లచ్చిరెడ్డి, సదానంద గౌడ్(ఎస్టీయూ), సైదులు (ఎస్టీఎఫ్), దాస్యనాయక్ (క్లాస్-4 ఉద్యోగుల సంఘం), పెన్షనర్ల సంఘ ప్రతినిధులు వెంకటరెడ్డి, కృష్ణమూర్తి, ఉమాదేవి పాల్గొన్నారు.