1 September, 2026 | 7:48 PM

క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి

01-09-2026 | 05:52pm

మెట్ పల్లి,(విజయక్రాంతి): రోజు రోజుకి వికృత రూపం దాలుస్తున్న క్యాన్సర్ వ్యాధి(Cancer disease) పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మెట్ పల్లి జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి(Met Pally Junior Civil Judge Vinukonda Madhavi) అన్నారు. మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయవాది చాప కిషోర్ సంతాప సభలో ఆమె పాల్గొన్నారు. ఆయన ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... క్యాన్సర్ తో న్యాయవాది మృతి చెందడం దిగ్బ్రాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసారు.

క్యాన్సర్ వచ్చాక పోరాటం కన్నా ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల ఇలాంటి బాధాకరమైన వార్తల్ని వినాల్సిన అవసరం రాదన్నారు. ముందస్తుగా క్యాన్సర్ పరీక్షలు(Cancer tests) చేసుకోవడం ఉత్తమం అని సూచించారు. అనంతరం న్యాయవాదులు రెండు నిముషాలు మౌనం పాటించారు. న్యాయవాది మృతికి సంతాప సూచకంగా సోమవారం, మంగళవారం వారి విధులకు దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమం లో ద్వీతీయ శ్రేణి న్యాయమూర్తి దయ్యా రాజారాం, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్ మరియు సభ్యులు పాల్గొన్నారు.