11 March, 2026 | 1:59 AM

ప్లాస్టిక్ వ్యర్థాలతో అందమైన బెంచీలు

11-03-2026 12:29 AM

శంకర్ పల్లి, మార్చి 10 (విజయ క్రాంతి):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల ప్రణాళిక - ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శంకర్ పల్లి మున్సిపాలిటీ పర్యావరణ హితమైన అడుగు వేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ, ’వేస్ట్ టు ఆర్ట్’ (వ్యర్థాల నుంచి కళాకృతులు) అనే వినూత్న కాన్సెప్ట్తో ప్లాస్టిక్ బాటిల్ క్యాప్ల సహాయంతో బెంచీలను తయారు చేయించారు.శంకర్ పల్లి మున్సిపాలిటీ మరియు బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి.

సుమారు 60 కేజీల రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు  ఉపయోగించి రెండు బెంచీలను రూపొందించారు. ఈ బెంచీలను ప్రస్తుతం శంకర్ పల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్. ప్రవీణ్ కుమార్, కమిషనర్ యోగేష్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.