21 August, 2026 | 9:42 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •   అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు   •   ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం   •   భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం   •   కోరుట్లలో మంత్రి పొంగులేటికి స్వాగతం పలికిన జువ్వాడి బ్రదర్స్   •   గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ   •  

మునగాకుతో అందంగా!

24-12-2024 12:00 AM

ఆరోగ్యానికి మునగాకు ఎంతో మేలు చేస్తుందనే విషయం తెలిసిందే. అయితే కేవలం ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మునగాకును ముఖానికి అప్లు చేయడం వల్ల యంగ్ లుక్‌లో కనిపిస్తారు. ఇందులో విటమిన్ ఏ,సి, ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. మునగాకును మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లు చేస్తే స్కిన్ మెరుస్తుంది.

వారానికొకసారి మునగాకును స్కిన్‌కి అప్లు చేస్తే పొడి చర్మ సమస్య అంతా క్లియర్ అవుతుంది. ముఖం చాలా అందంగా కనిపిస్తుంది. కేవలం మునగాకు పేస్ట్‌కే కాకుండా ఆకులను ఎండబెట్టి పౌడర్‌లా కూడా తయారు చేసుకోవచ్చు. పౌడర్‌లో కాస్త రోజ్ వాటర్ కలిపి ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖం తెల్లగా, అందంగా మారుతుంది. మునగాకులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే చర్మంపై ఎలాంటి మొటిమలు, మచ్చలు రాకుండా నివారించడంలో మునగాకు బాగా సహాయపడుతుంది.