భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం
21-08-2026 09:25 PM
రాజాపూర్: మండల కేంద్రంలోని శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహాలక్ష్మి దేవి ఆశీస్సులు కలగాలని మహిళలు వేద పండితుల ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతం కుంకుమార్చన చేశారు. మహాలక్ష్మి దేవికి ప్రీతి పాత్రమైన దీవివంటలను నైవేద్యం పెట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే మండలంలోని పలు గ్రామాలలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.






