19 April, 2026 | 3:34 AM

కాఫీ ఆరోగ్యానికి మంచిదే!

24-12-2024 12:00 AM

చాలామందికి ఉదయం నిద్రలేచి ఫ్రెష్ అయ్యాక టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇవి తాగకపోతే కొంతమందికి రోజు ప్రారంభంకాదు. అయితే ఇవి పరిమితంగా తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని పోర్చుగల్‌లోని కోయింబ్రా విశ్వవిద్యాలయ బృందం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

టీ కాఫీ తాగడం వల్ల ఎక్కువ లాభాలున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగడం వల్ల కండరాలు, గుండె, మానసిక ఒత్తిడి, రోగనిరోధక వ్యవస్థ పనితీరులో మంచి మార్పులు కలుగుతున్నట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. హృదయ, శ్వాసకోశ వ్యాధులు, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్లు, డయాబెటిస్,డిప్రెషన్ వంటి సమస్యలు చాలా వరకు తగ్గుతున్నట్లు వెల్లడించారు. ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియాల్లో కాఫీ అలవాటు ఉన్న వ్యక్తులపై పరిశోధన చేసి ఈ విషయాలను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. అయితే ఒకటి లేదా రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీని రోజులో తీసుకోవద్దని.. దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కాకుండా ఏదైనా తిన్న తర్వాత తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.