6 May, 2026 | 9:56 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

సూట్.. సూపర్!

02-09-2025 12:00 AM

పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నే ని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తర్వాత పవన్‌కళ్యాణ్ -హరీశ్‌శం కర్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈనెల 6న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఈ షెడ్యూల్ లో పవన్‌కళ్యాణ్‌తోపాటు పలువురు ప్రముఖ నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటారు.

రాబోయే షెడ్యూల్‌తో టాకీ భాగం దాదాపు పూర్తవుతుంది. అయితే, సెప్టెంబర్ 2న (నేడు) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోమవారం ఈ చిత్రం నుంచి ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. త్రీ పీస్ సూట్, టోపీతో పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి పవన్‌కళ్యాణ్ చాలా అందంగా కనిపిస్తున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న .

ఈ సినిమాలో పార్థిబన్, కేఎస్ రవికు మార్, ఎల్‌బీ శ్రీరామ్, రాంకీ, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేశ్, జయప్రకాశ్, వర్గీస్, మీర్ సర్వర్, ప్రవీణ్, టెంపర్ వంశీ, నవాబ్ షా, శ్రీరామ్, మాగంటి శ్రీనాథ్, కిల్లి క్రాంతి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీ తం, రామ్-లక్ష్మణ్ ద్వయం యా క్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. అయ నంక బోస్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. కే దశరథ్, రమేశ్‌రెడ్డి కథ నం రాయగా, కళా దర్శకుడిగా ఆనంద్ సాయి వ్యవహరిస్తున్నారు.