లాయర్‌ను కాబట్టి ఆ పాత్ర ఈజీగా చేశా
వీర్‌రెడ్డి, దయానంద్‌రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో సిల్వర్ కాస్ట్ బ్యానర్‌పై శాంతమ్మ మలికిరెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో వీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు.
కరోనా టైమ్‌లో పాడ్ కాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ సమయంలో సినిమా వాళ్లతో పరిచయం ఏర్పడింది. ఓ మంచి సినిమా చేద్దాం అనుకుని, లాయర్‌ను కాబట్టి నాకు ఈ పాత్ర చేయడం సులభంగా అనిపించింది. ఇంతవరకు మన దగ్గర లీగల్ థ్రిల్లర్ సినిమాలు అంతగా రాలేదు’ అన్నారు. ఇంకా ఇక దర్శకుడు రవి, డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ చౌదరి, డైరెక్టర్ రవి గోగుల, ప్రొడ్యూసర్ శాంతమ్మ మలికిరెడ్డి పాల్గొన్నారు.






