ఎమోషన్ వారధి
అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా రూపొందిన చిత్రం ‘వారధి’. రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌పై పెయ్యాల భారతి, ఎండీ యూనస్ ఈ సినిమాను నిర్మించారు. శ్రీ కష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ మూవీ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది.
ఈ సందర్భంగా హీరో అనిల్ అర్కా మాట్లాడుతూ... “భార్యభర్తల మధ్య బంధం ఈ సినిమాలో చాలా ఎమోషన్‌గా, ఎట్రాక్టుగా ఉండబోతుంది” అని తెలిపాడు. విహారికా చౌదరి మాట్లాడుతూ... “డైరెక్టర్ ప్రతి ఒక్కరి నుంచి ఫర్ఫెక్ట్ టాలెంట్ తీసుకున్నారు. చ్రిత్ర యూనిట్‌లో అందరి సహకారం వల్లే నేను ఈ సినిమా ఎంతో హ్యాపీగా చేయగలిగాను” అని పేర్కొంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకష్ణ మాట్లాడుతూ.. “ఇదొక ఎమోషన్ డ్రామా.
భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా భావోద్వేగంగా తెరకెక్కించాం. కొత్త వాళ్ళతో చేసిన ఈ మూవీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మన ఇంటి పక్కనే జరుగుతున్నట్టు అనిపిస్తుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రచీర మూవీ డైరెక్టర్ సుమన్ పాల్గొన్నారు.






