5 July, 2026 | 4:35 PM

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం

05-07-2026 03:57 PM

బోథ్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పేర్కొన్నారు. ఆదివారం నేరడిగొండ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన 1,75,000 విలువైన చెక్కును బొత్ పట్టణానికి చెందిన కదం అనిల్ కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య ఉంటే ఫోన్ కాల్ చేసిన స్పందిస్తానన్నారు ముఖ్యమంత్రి సహాయనిది నిరుపేదలకు ఒక వరంగా మారిందని పేర్కొన్నారు భవిష్యత్తులో పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ మందుల రమేష్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి నాయకులు అనుపట్ల సంజీవ్ మురళి గౌడ్ వినోద్ తదితరులు ఉన్నారు