17 April, 2026 | 12:08 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

అగ్నివీర్'కి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ విద్యార్థి..

19-04-2025 11:49 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికీ చెందిన డిగ్రీ విద్యార్థి అగ్నివీర్ కు ఎంపికయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మార్త సాయికుమార్ భారత సైన్యంలో చేరికకు సంబంధించి 'అగ్నివీర్' పోటీలో పాల్గొని ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. 2025 జనవరి బ్యాచ్ లో జరిగిన ఎంపికలో ఈ విద్యార్థి పాల్గొని ప్రతిభ కనబరిచారు.

దీంతో విద్యార్థి సాయికుమార్ ను ఇండియన్ నేవీకి ఎంపిక చేస్తూ 'మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇండియా' వారు కాల్ లెటర్ పంపించారు. ఈ మేరకు విద్యార్థి మార్త సాయికుమార్ ఈనెల 14 న ఇండియన్ నేవీలో 'టెక్నికల్ ఆర్గనైజేషన్ ఆఫీసర్'గా విధుల్లో చేరారు. ఈ ఉద్యోగ ప్రయత్నంలో తనకు సహకరించిన తల్లిదండ్రులకు, కాలేజీ మెంటార్ రామరాజు సార్ కు, ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ ర్లకు విద్యార్థి సాయికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి సాయికుమార్ ను కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.