4 May, 2026 | 3:11 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

ఇందిరమ్మ ఇండ్ల ద్వారా లబ్ధిదారుల

11-03-2026 12:00 AM
  1. జీవితాల్లో వెలుగు నింపడం నా ధ్యేయం

ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

మంథని,మార్చి10(విజయ క్రాంతి) ఇందిరమ్మ ఇండ్ల ద్వారా లబ్ధిదారుల జీవితాల్లో వెలుగు నింపడం నా ద్యేయమని,ప్రజా పాలనలో ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటామనిరామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంద్వారా లబ్ధిపొందిన కుటుంబాలకు  నివాస సౌకర్యం కల్పించడం జరుగుతోందన్నారు. రామగుండం 1వ డివిజన్ మేడిపల్లి విలెజ్ ని నూతన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్,  మేయర్ మహంకాళి స్వామి  హాజరై, నూతన  గృహాన్ని ప్రారంభించి లబ్ధిదారులను అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అనే కలను నిజం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్  లక్ష్యమని, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎంతో మంది నిరాశ్రయులకు స్థిర నివాసం లభిస్తోందని, ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం,  స్థానిక నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు ప్రజలు, స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  పాల్గొన్నారు.