18 March, 2026 | 5:28 AM

గెలుపు బావుటా ఎగరేసిన బెంగాల్, పునేరి

04-11-2024 12:00 AM

హైదరాబాద్: ప్రొకబడ్డీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్జ్, పునేరి పల్టన్ విజయం సాధించాయి. మొదటి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్జ్ 40-38 తేడాతో హర్యానా స్టీలర్స్‌పై, రెండో మ్యాచ్‌లో పునేరి పల్టన్ 35-28 తేడాతో యూముంబాపై గెలుపుబావుటా ఎగరేశాయి. బెంగాల్ స్టార్ రైడర్ మనీందర్ సింగ్ సూపర్ టెన్ సాధించి విజయంలో కీలకపాత్ర పోషించాడు. పునేరి జట్టులో ఆల్‌రౌండర్ అస్లాం ఇనాందార్ 10, రెయిడర్ మోహిత్ గోయత్ 9 పాయింట్లతో మెరిశారు.