8 May, 2026 | 1:56 AM

బంగాల్ అసెంబ్లీ రద్దు

08-05-2026 12:51 AM
  1. మమత ఇక సీఎం కాదు
  2. గవర్నర్ ఆర్‌ఎన్ రవి స్పష్టీకరణ

కోల్‌కతా, మే 7: పశ్చిమ బంగాల్‌లో అ నూహ్య పరిణామం చోటుచేసుకుంది. ము ఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి నిరాకరిస్తున్న మమతా బెనర్జీకి చుక్కెదురైంది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించి గురువారం రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రద్దయినట్లయింది. మమతా బెనర్జీ ఇకపై ఆ సీఎం కాదని గవర్నర్ స్పష్టం చేశారు. రా జ్యాంగంలోని ఆర్టికల్ 174 (2)(బీ) ప్రకా రం అసెంబ్లీని రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. అసెంబ్లీ పదవీకాలం బుధవారంతో ముగియడంతోనే రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే వరకు తానే తాత్కాలికంగా పాలనపరమైన బాధ్యతలు తీసుకుంటానని తేల్చిచెప్పారు.