14 August, 2026 | 12:51 PM

జర్నలిస్టుల సమస్యలపై ఐజేయు నిరంతర పోరాటం

14-08-2026 11:44 AM

తుంగతుర్తి నూతన మండల కమిటీ ఎన్నిక పట్ల హర్షం.

మండల అధ్యక్షులు పూసపెల్లి. యాదగిరి

తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలపై టి యు డబ్ల్యు జే ఐ జేయు నిరంతర పోరాటం చేస్తుందని, నూతన అధ్యక్షుడు పూసపెల్లి యాదగిరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని డిఆర్ ఫంక్షన్ హాల్లో నూతన కమిటీని, రాష్ట్ర ఐజ యు ఆదేశాల మేరకు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సీనియర్ జర్నలిస్టు శంకరామంచి రవీందర్ శర్మ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన మండల కమిటీలో అధ్యక్షుడుగా పూసపల్లి యాదగిరి, ఉపాధ్యక్షులుగా ఓరుగంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కోదాటి విక్రమ్, కోశాధికారిగా కొండగడుపుల ఎల్లయ్యను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఐజేయూ సంఘం బలోపేతములో, జర్నలిస్టుల హెల్త్ కార్డు, ఇంటి స్థలాల మంజూరి సమస్యలపై, రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు తాళ్లపల్లి సోమన్న, వడ్లకొండ శ్రీనివాస్, ఎండి నసిరుద్దీన్, ఎండి మాజిద్, అండం సైదులు, భూపతి సైదులు, ఎల్లబోయిన రాజేంద్రప్రసాద్, వర్ధల్లి వీరమల్లు, బింగి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.