ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనకి చేసిన ఎమ్మెల్యే
14-08-2026 12:46 PM
నిజాంసాగర్ ఆగష్టు 14(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు శుక్రవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ స్థానిక నాయకులు రామ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.






