14 August, 2026 | 2:17 PM

100 మీటర్ల జాతీయ జెండాతో బోధన్‌లో హర్ ఘర్ తిరంగా యాత్ర

14-08-2026 12:50 PM

బోధన్, ఆగస్టు 14 (విజయక్రాంతి): భారత ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పిలుపు మేరకు దేశ ఐక్యతను చాటేందుకు బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం 100 మీటర్ల భారీ జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా(Har Ghar Tiranga) యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డీ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగానే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ యువత, ప్రజలు వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణతో పాటు భారతదేశ గౌరవ ప్రతిష్టలను మరింత పెంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. ఆగస్టు 15న ప్రతి భారతీయుడు గర్వంగా తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లడమే హర్ ఘర్ తిరంగా యాత్ర ఉద్దేశమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షుడు పసులోటి గోపికిషన్, మాజీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక బాలరాజు, సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి, గుంత గంగాధర్, రాజులదేవి పవన్ కుమార్, హన్మండ్లు చారి, పట్టణ ప్రధాన కార్యదర్శి మీర్జాపూర్ అరవింద్, కార్యదర్శి దేవకాటే శివరాజ్, బీజేవైఎం, పట్టణ అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్, పార్టీ నాయకులు పప్పుల వేణు, శ్రీకాంత్, దుర్గా ప్రసాద్, గడ్డం శ్రీనివాస్, మహేష్, కస్ప లింగం, అనీల్, పడాల శ్రీను, ఫణి, ఈ.వి. రంగారావు తదితరులు పాల్గొన్నారు.