6 April, 2026 | 10:25 PM

గజ్వేల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణకు ‘ఉత్తమ గైనకాలజిస్ట్’ అవార్డు

06-04-2026 08:48 PM

గజ్వేల్: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య, ఆరోగ్య రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి అందజేసే రాష్ట్ర స్థాయి పురస్కారానికి గజ్వేల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ఎంపికయ్యారు. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో అత్యధిక ప్రసవాలు (డెలివరీలు) నిర్వహించినందుకు గాను ఆమెను ‘ఉత్తమ గైనకాలజిస్ట్’, ‘ఉత్తమ డి.సి.హెచ్.ఎస్ మెడికల్ సూపరింటెండెంట్’ అవార్డులకు ప్రభుత్వం ఎంపిక  చేశారు.

నేడు రవీంద్ర భారతిలో  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ అవార్డుకు ఎంపికవ్వడంపై డాక్టర్ అన్నపూర్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పురస్కారం లభించడం వల్ల తనపై బాధ్యత మరింత పెరిగిందని, ఇది కేవలం నా ఒక్కరి కృషి కాదని, గజ్వేల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న  వైద్యులు సిబ్బంది శ్రమ, సహకారం వల్లే ఈ గుర్తింపు లభించిందన్నారు. అందరికీ  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.