తెలుగులోకి బెత్లెహెం కుడుంబ యూనిట్
నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన తాజాచిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో ఫన్ లవ్ ఎంటర్‌టైమెంట్ అదిరిపోయింది. నివిన్ పౌలీ జస్టిన్ పాత్రలో కనిపించారు.
2005లో ఆన్‌లైన్‌లో క్యాసెట్ పాటలను కన్వర్ట్ చేసి అప్‌లోడ్ చేస్తూ తనకు తానే ‘ఎంపీ3కింగ్’ అనే పేరు పెట్టుకున్న జస్టిన్ పాత్రలో పరిచయం కావడం ఆకట్టుకుంది. మమితా బైజు కాలేజీ విద్యార్థినిగా, గిటార్ వాయిస్తూ ఆల్టర్నేటివ్ రాక్ మ్యూజిక్‌ను ఇష్టపడే అమ్మాయిగా కనిపించింది. నివిన్ పౌలీ, మమితా బైజు లైట్ హార్టెడ్ హ్యూమర్, న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రేమ, హ్యూమర్, నాస్టాల్జియా, కమ్యూనిటీ డ్రామాను కలిపిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి సంగీతం: విష్ణు విజయ్; సినిమాటోగ్రఫీ: అజ్మల్ సాబు; ఎడిటర్: ఆకాశ్ జోసెఫ్ వర్గీస్.






