బిల్లా రంగా బాషా యాక్షన్
కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న పీరియడ్- యాక్షన్ స్పెక్టకిల్ ‘బిల్లా రంగా బాషా: ది ఫస్ట్ బ్లడ్’. అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ వినూత్నమైన ప్రమోషనల్ క్యాలెండర్‌ను ప్రకటించారు.
ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ 2026 సెప్టెంబర్ 2 నుంచి 2027 చివరి క్వార్టర్‌లో సినిమా విడుదలయ్యే వరకు కొనసాగనుంది. సుదీప్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న ఈ ప్రచార కార్యక్రమం అధికారికంగా ప్రారంభమవుతుంది.
ఈ సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించనున్నారు. 2027 తొలి క్వార్టర్‌లో టీజర్ విడుదల చేయనున్నారు. అనంతరం 2027 మూడో క్వార్టర్లో భారీ ప్రమోష నల్ ఫేజ్‌ను ప్రారంభించి, ట్రైలర్, పాటలను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 2027 చివరి క్వార్టర్‌లో సినిమాను థియేటర్లలోకి తీసుకు రాను న్నారు. ఈ సినిమా అన్ని దక్షిణ భారతీయ భాషలతో పాటు హిందీ లోనూ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.






