మెరుగ్గా బ్యాంక్‌ల బ్యాలెన్స్ షీట్స్
27-12-2024 12:49 AM
- మరింత తగ్గిన మొండి బకాయిలు
- ఆర్బీఐ రిపోర్ట్
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత్‌లో బ్యాంక్‌ల బ్యాలెన్స్ షీట్స్ పటిష్ఠంగా ఉన్నాయని, డిపాజిట్లు, రుణాలు పెరుగుతు న్నాయని, మొండి బకాయిలు మరింత తగ్గాయని రిజర్వ్‌బ్యాంక్ గురువారం విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీలు) కూడా మెరుగుపడ్డాయని, బ్యాలెన్స్ షీట్ వృద్ధి రెండంకెల్లో ఉన్నదని తెలిపింది.
బ్యాంక్‌ల మూలధనం, లిక్విడిటీ రెగ్యులేటరీ నిబంధనలకంటే మించి ఉన్నాయని, వరుసగా ఆరో ఆర్థిక సంవత్సరం 2023-24లో లాభదాయకతను పెంచుకున్నాయని ఆర్బీఐ వివరించింది. రానున్న రోజుల్లో బ్యాంక్‌లు వాటి రిస్క్ మేనేజ్‌మెంట్, ఐటీ గవర్నెన్స్ ప్రమాణాల్ని పటిష్టపర్చి, అనుమానాస్పద లావాదేవీలపై దృష్టిపెట్టాలని రిజర్వ్‌బ్యాంక్ సూచించింది.






