మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత
మహిళా సంఘాల సభ్యులకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు
బోయినిపల్లి: ఆగస్టు 20 ( విజయ క్రాంతి ): మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మహిళా సంఘాల సభ్యులతో కలిసి ప్రారంభించారు.
కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, వైద్యారోగ్య శాఖ అధికారిణి ఏంజెలా అల్ఫ్రెడ్, సర్పంచ్ మోహన్, మండల ప్రత్యేక అధికారి శరత్, తహసీల్దార్ షరీఫుద్దీన్, వైద్యులు, మహిళా సంఘాల సభ్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






