చర్లలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ
- ఇర్ప శ్రీనివాసరావు
మార్కెట్ కమిటీ చైర్మన్
చర్ల,(విజయక్రాంతి): భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గురువారం చర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు మాట్లాడుతూ... "కోట్లాది ప్రజల్లో ఆశలను నింపి, 21వ శతాబ్దపు అవకాశాలకు భారతదేశాన్ని సిద్ధం చేసిన దూరదృష్టిగల నాయకుడు రాజీవ్ గాంధీ. ఆయన చేపట్టిన విప్లవాత్మక మార్పులతోనే భారత యువతపై ఆయనకున్న అచంచల విశ్వాసం, సాంకేతిక పురోగతిపై ఆయన చూపిన దూరదృష్టి నేటికీ మనకు స్ఫూర్తి" అని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్ల పిఎసిఎస్ చైర్మన్ పరుచూరి రవికుమార్, చర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ పూజారి సామ్రాజ్యం, ఉపసర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు తదితరులు పాల్గొన్నారు.






