వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, వికలాంగుల వినతి
అల్వాల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్య లను వెంటనే పరిష్కరిం చాలని తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి కమిటీ సభ్యులు కోరారు. గురు వారం గాంధీభవన్ ఆవరణలోని ఇందిరా భవన్ లో వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి వారు హజరై, మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వికలాంగుల శాఖ కమీషనర్ గా వికలాంగులనే నియమించాలని, ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేం దుకు వికలాంగులైన పురుషులకు కూడా ఫ్రీ పాస్ ఇవ్వాలని కోరారు.
అలాగే, వికలాంగులకు కొత్త పించన్లు మంజూరు చేసి, రూ 4,016 పించను దారులకు రూ 6,000 పించను పెంచాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో వికలాంగులకు ప్రాముఖ్యత ఇవ్వాలని, బ్యాక్ లాగ్ ఫోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని, వికలాంగుల సంక్షమ శాఖ డైరెక్టర్ గా ఐఏఎస్ ను నియమించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి కమిటీ సభ్యులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ గుత్తికొండ, హైదరా బాద్ అధ్యక్షులు పెద్దగొల్ల నాగరాజు, రాష్ట్ర మహిళా నాయకురాలు యశోద తదితరులు ఉన్నారు.






