17 July, 2026 | 9:31 AM

విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి

22-06-2024 03:48 AM
  • ఎంపీ మల్లు రవి

గద్వాల (వనపర్తి), జూన్ 21 (విజయక్రాంతి): వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఎంపీ మల్లు రవి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం ఆయన జడ్పీ చైర్‌పర్సన్ సరితతో కలిసి సందర్శించి సంబంధిత అధికా రులకు పలు అంశాలపై సూచనలిచ్చారు. విద్యార్థినులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం ఐటీఐ కళాశాల పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.75 లక్షలు మంజూరు చేయిస్తానన్నారు. తర్వాత ఎంపీ వనపర్తి జిల్లా కేంద్రాని చేరుకున్నారు. ఎమ్మెల్యే తూడి  మేఘారెడ్డితో కలిసి ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. తెలంగాణ లో బీఆర్‌ఎస్ మునిగే నావ అని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలను సందర్శించారు. పర్యటనలో డీఈవో గోవిందరాజులు ఉన్నారు.