రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలి
22-06-2024 03:46 AM
- నిజామాబాద్ ఎంపీ అర్వింద్
నిజామాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): నిజామాబాద్ శివారులో చేపడుతున్న మాధవనగర్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులను సత్వరం పూర్తి చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆదేశించారు. శుక్రవా రం ఆయన పనులను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మాధవనగర్, అడవి మామడిపల్లి, అర్సాపల్లి, ఆర్మూర్ మామిడిపల్లి రైల్వే వంతెన పనులపై రోడ్లు భవనాలశాఖ అధికారులతో జిల్లాకేంద్రం లో సమీక్షించారు. కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయకపోవడంతో నత్తనడకన పనులు సాగుతున్నాయని, వెంటనే రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటి వెంకటరెడ్డి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం నిర్మాణాలకు కేటాయించిన నిధులను ఇతర పనులకు మళ్లించిందన్నారు.






