21 April, 2026 | 4:31 PM

Breaking News

ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •   ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం   •   ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడదాం   •   జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •  

ప్రజలకు మరింత మెరుగైన సేవలు

27-03-2025 01:35 AM

అన్ని శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశం

కాటారం (భూపాలపల్లి) , మార్చి 26 (విజయక్రాంతి) :  ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమర్థంగా, సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం గణపురం తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డులు విచారణ, తాగు, సాగునీరు, ఎల్‌ఆర్‌ఎస్ తదితర అంశాలపై రెవెన్యూ, పంచాయతి రాజ్, ఇరిగేషన్,  వ్యవసాయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులు తమ తమ విభాగాలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ముఖ్యంగా తాగు, సాగునీటి సమస్యల పరిష్కారం, ఉపాధి హామీ పనుల పురోగతి, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వేగవంతంపై అధికారులు దృష్టి సారించాని తెలిపారు.  సాగునీరు విషయమై వచ్చే అంశాలపై దృష్టి పెట్టాలని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. మండలంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, నీరు అందేలా చూడాలని అన్నారు. నీటి కాల్వల వద్ద నీటిని బ్లాక్ చేయకుండా చూడాలని, ఎక్కడైనా గేట్ బ్లాక్ చేస్తే వెంటనే  అధికారులను సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవాలని అన్నారు.   నూతన రేషన్ కార్డులు ధరఖాస్తులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, పంచాయతి, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.