20 June, 2026 | 1:24 AM

జీతం చాలదు.. పర్మినెంట్ కాదు

20-06-2026 12:36 AM

చాలీ చాలని జీతాలు

ఇబ్బందుల్లో జీపీ కార్మికులు

కోటి ఆశలతో ఎదురుచూపులు

బోధన్, జూన్ 19 (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా చాలీచాలని జీతాలకే విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయి. చాలీచాలని జీతాలతో సతమతమవుతున్నారు. భవిష్యత్లో జీతం పెరుగుతందని కోటి ఆశలతో ఎదురుచుస్తున్నారు. తెలంగాణ వచ్చాకైనా మా బతుకులు బాగుప డలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం లేచింది మొదలు సాయంత్రం, రాత్రి అనకుండా గ్రామాల్లోని డ్రైనేజీ, వీదులు, ఇంటి పన్నులు, నల్ల పన్నులు, వీధి లైట్లు, గ్రామ ప్రజలకు నీటిని అందించడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, అధికారులు చెప్పిన పనులు చేయడంతో పాటు మౌలిక వసతుల రూపలకల్పనలో గ్రామ పంచాయతీ కార్మికుల పాత్ర కీలకమైంది.

పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాం  ట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. కాని గ్రామ పంచాయతీల్లో ఎన్నో ఏళ్లుగా చాలీచాలని జీతాలతో కాంట్రాక్ట్ ఉద్యో గులుగా పనిచేస్తున్న కార్మికులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలాల్లో 32 పాత గ్రామ పంచాయతీలు ఉండగా 5 నూతనంగా ఏర్పాటు కావడంతో 37కి చేరాయి.

పాత జీపీల ప్రకారంగా ఉన్న సిబ్బంది

అందులో 26 గ్రామ పంచాయతీ కార్యదర్శు లు పుల్టైం వర్కర, 1బిల్ కలెక్టర్ ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 6 మంది, అటెండర్లు లేరు. బోధన్ మండలంలో ఎలక్ట్రిసిటీ, పంప్ ఆపరేటర్లు ,మంది, శానిటే షన్ స్వీపర్లు  ఇతరులు కలిపి మొత్తం 89 మంది పుల్టైం వర్కర్లు పనిచేస్తన్నారు.

చాలీచాలని జీతాలు

జీపీ కార్మికులకు నెలకు రూ.800 నుంచి రూ.9500 వేల వరకు జీతాలు ఇస్తున్నారు. ఇవి సక్రమంగా నెలనెలకు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీపీ కార్మికులకు కనీస వేతనాలు, ఈపీఎఫ్. ఈ ఎస్‌ఐ చెల్లించాలని ప్రభుత్వం నుంచి విడుదలైన జీవోలు, మెమోలను పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కల్పన కమి షనర్ నుంచి జిల్లా ఉన్నతాధికారులకు గతంలో పంపించారని, అమలు చేయడంలో జిల్లా అధిచాలీ చాలని జీతాలు

ఇబ్బందుల్లో జీపీ కార్మికులు కోటి ఆశలతో ఎదురుచూపులు

కారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జీపీ కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి 2013 మే, జూన్లో 33 రోజులు చేసిన సమ్మెకు ప్రభుత్వం అమలు చేస్తానని హామీ ఇచ్చినా నేటికి కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికై నా తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్మికు లను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం జీవో నంబర్ 3 ను అమలు చేయాలని కోరుతున్నారు.

రూ.20 వేలకు పెంచాలి

అటెండర్‌గా విధుల్లో చేరినప్పుడు రూ.1000 జీతం ఇచ్చారు. ఇప్పడు పారిశుద్ధ కార్మికుడిగా రూ.9500 జీతం ఇస్తున్నారు. పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలి. వారి తో పాటు గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం రూ.20 వేల జీతం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. 

నెలనెలా ఇవ్వడం లేదు

బేల్లాల్ గ్రామం 1995లో గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధుల్లో చేరాను. అప్పుడు రూ.500 జీతం అందించారు. 15 ఏళ్లుకు రూ.9500 జీతం అందిస్తున్నారు. ఇవి నెలనెలా ఇవ్వడం లేదు. జీతాలు పెంచాలి.

- ఉస్క సాయిలు, 

గ్రామపంచాయతీ పరిశుద్ధ 

కార్మికుడు ఊటుపల్లి

జీవో వచ్చిన తర్వాతే...

ప్రభుత్వం నుంచి జీవో వచ్చిన తర్వాత జీతాలు పెంచడం జరుగుతుంది. ప్రస్తుతం సర్పంచ్ లకు చెక్పవర్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. ప్రతి గ్రామపంచాయతీ పన్ను వసూల్లో 50 శాతం కార్మికులకు ఖర్చు చేశాం. వచ్చే సంవత్సరం నుంచి వేతన సవరణ చేస్తాం.

- జే.కిషోర్ కుమార్ 

ఎంపీడీవో, బోధన్