నార్నే నితిన్ రొమాంటిక్ కామెడీ
‘మ్యాడ్’, ‘ఆయ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి సినిమాలతో వరుస విజ యాలు అందుకున్నారు యంగ్ హీరో నార్నే నితిన్. ఇప్పుడాయన మరో కొత్త చిత్రంతో రానున్నారు. ‘జూనియర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ ఈ తాజా చిత్రాన్ని సరికొత్త రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతానికి ‘ఎన్‌ఎన్5’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ కొత్త సినిమాను ప్రకటించారు నిర్మాత వెంకట్ కే నారాయణ.
నార్నే నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్ట్టాగ్రామ్ పోస్టు తరహాలో డిజైన్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ యూత్‌ఫుల్ రొమాంటిక్ వైబ్‌లో ఆకట్టుకుంటోంది. ‘ఆకాశంలో ఉంటుంది మూన్.. నువ్వే నా లైఫ్‌కి క్వీన్.. అనే ఫన్నీ లైన్‌తోపాటు వేలాది లైక్స్, కామెంట్స్, ట్రెండీ హ్యాష్‌ట్యాగ్స్ ఈ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా నార్నే నితిన్ బావ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పోస్టును లైక్ చేసినట్లు చూపించడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.
ప్రేమ, హాస్యం, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించబోతోంది. ఈ చిత్రానికి రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. శివ కామేశ్ డీ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.
బొగ్గు గనుల నేపథ్యంలో యాక్షన్ డ్రామా..
నార్నే నితిన్ తన ఆరో చిత్రం కోసం బలమైన కథాంశం ఉన్న కథను ఎంచుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిం చారు. యూ సుహాస్‌బాబు దర్శకత్వంలో, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ చిత్రం బొగ్గు గనుల నేపథ్యంలో సాగే సర్వైవల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో ఆకర్షిస్తోంది. ఇందులో నార్నే మైనర్ హెల్మెట్, వర్కర్ దుస్తు ల్లో రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.






